Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

5pm chicken - 5pm చికెన్

5pm chicken - 5pm చికెన్

Chicken Varieties
Indian Recipes


చికెన్‌ను కూర వండటం మామూలే! ఫ్రై... షరా మామూలే!
చికెన్ బిర్యానీ ఎప్పుడూ విన్నదే! చికెన్‌కూ చిర్రెత్తుకొచ్చేలా...
ఎప్పుడూ ఒకే టైప్... ఏముంది స్పెషల్?! అనేవారు...
ఈ వారం చికెన్‌తో వెరైటీ స్నాక్స్ చేసి తక్కువ టైమ్‌లో జిహ్వను కట్టిపడేసే రుచులతో
ఇంటిల్లిపాదినీ అబ్బుర పరచండి.
‘వహ్వా’ అనిపించేలా ప్రతి సాయంత్రం ‘కో..కో.. కో’టి మార్కులు కొట్టేయండి.


చికెన్ పొట్లి

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా. (సన్నగా కట్ చేసుకోవాలి), బీన్స్ తరుగు, క్యారెట్ తరుగు, ఉల్లికాడల తరుగు - 3 టీ స్పూన్ల చొప్పున, టొమాటో- 1 (తరగాలి), సోయాసాస్- 2 టీ స్పూన్లు, కారం - టీ స్పూన్ (తగినంత వేసుకోవచ్చు), ఉప్పు - తగినంత, నల్ల మిరియాలు - 5, మైదా - 3 టేబుల్ స్పూన్లు, పాలు - కప్పు, నిమ్మరసం - టీ స్పూన్

తయారి:
మైదాను పాలతో చపాతీ పిండిలా కలిపి పక్కనుంచాలి. పాన్‌లో నూనె వేడయ్యాక క్యారట్, బీన్స్, ఉల్లికాడల తరుగు వేసి వేయించాలి. తర్వాత అందులో చికెన్, టొమాటో, సోయా సాస్, ఉప్పు, మిరియాలు కలిపి కొద్దిగా వేగనివ్వాలి. మైదా పిండిని చిన్న పూరీలా చేసుకొని అందులో చికెన్ మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి (ఉల్లి కాడలతో మూటలా కట్టాలి) పొట్లిని తయారు చేయాలి. ఇలా తయారుచేసుకున్న పొట్లీలను ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించాలి. వీటిని సాస్‌తో వేడి వేడిగా తింటే రుచిగా ఉంటాయి.


చికెన్ మిర్చీ బజ్జీ

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా., పండు మిర్చి లేదా పచ్చిమిర్చి - 10, పసుపు - చిటికెడు, కారం - టీ స్పూన్, కొత్తిమీర తరుగు - టీ స్పూన్, కరివేపాకు - ఒక రెమ్మ, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి తగినంత, మైదా - 2 టీ స్పూన్లు, ఉల్లిపాయ తరుగు - 2 టేబుల్ స్పూన్లు

తయారి:
కుకర్‌లో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయలు గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అందులో పసుపు, కారం, గరం మసాలా, చికెన్, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. తర్వాత కొద్దిగా నీరు పోసి, కుకర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చాక దింపేసి చల్లారనివ్వాలి. తర్వాత గ్రైండ్ చేయాలి. పండుమిరప కాయలను మరిగే నీళ్లలో వేసి చల్లారనివ్వాలి. తర్వాత మైదాపిండిలో కొద్దిగా ఉప్పు, నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా నూనె అద్దు కొని కలిపితే పిండి మృదువుగా వస్తుంది. పిండిని చిన్న చిన్న ముద్దలు తీసుకొని పూరీలా వత్తాలి. తర్వాత పూరీని కత్తితో సన్న సన్నని రిబ్బన్లుగా కట్ చేయాలి. మిర్చీకి గాటు పెట్టి అందులో చికెన్ మిశ్రమాన్ని నింపాలి. ఇలా నింపిన మిర్చీని కట్ చేసిన పూరీ రిబ్బన్ల మీద ఉంచి రోల్ చేయాలి. దీనిని నూనెలో డీప్ ఫ్రై చేయాలి.


చికెన్ స్టిక్ బార్

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.లు, పచ్చిబఠానీ- 50 గ్రా.లు, బంగాళదుంపలు - 100 గ్రా.లు, గరం మసాలా - టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్, కారం - 2 టీ స్పూన్లు, ఉప్పు- తగినంత, కోడిగుడ్డు - 1

తయారి:
చికెన్‌కు అల్లం వెల్లులి పేస్ట్ పట్టించి పక్కన పెట్టాలి. తర్వాత స్టౌ పై బాణలి పెట్టి చికెన్‌ను మిగతా పదార్థాలతో (కోడిగుడ్డు మినహా) కలిపి ఉడికించి, చల్లారిన తర్వాత మరీ మెత్తగా కాకుండా గ్రైండ్ చేయాలి. ప్లేట్‌లో చాకోబార్ షేప్‌లో చికెన్ మిశ్రమాన్ని సర్ది దానికి ఐస్‌క్రీమ్ పుల్లను గుచ్చాలి. ఒక పాత్రలో కోడిగుడ్డును గిలక్కొట్టి పక్కన ఉంచాలి. పెనం మీద నూనె వేసి చికెన్ స్టిక్ బార్‌ని కోడిగుడ్డు మిశ్రమంలో ముంచి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. టొమాటో సాస్‌తో కలిపి వేడి వేడిగా తినాలి.


ఓట్స్ చికెన్ టిక్కా

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.లు, ఓట్స్ - 2 టేబుల్‌స్పూన్లు
బియ్యప్పిండి - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - తగినంత, కారం - 2 టీ స్పూన్లు, పచ్చిబఠాణీలు - 2 టేబుల్ స్పూన్లు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ - స్పూన్, పెరుగు - 3 టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు - టేబుల్‌స్పూన్

తయారి:
చికెన్‌ను గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేయాలి. ఇందులో ఓట్స్, పెరుగు, పుదీనా పేస్ట్, పచ్చిబఠాణీల పేస్ట్, కారం, ఉప్పు కలపాలి. చిన్నచిన్న ముద్దలు తీసుకొని అరచేతిలో వత్తి, బియ్యం పిండిలో అద్ది, నాన్‌స్టిక్ పాన్ మీద వేయించాలి. వీటి తయారికి నూనె వాడాల్సిన అవసరం లేదు.


కాన్‌పురా చికెన్

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.
తెల్ల మిరియాలపొడి - తగినంత
ఉప్పు - రుచికి తగినంత
మైదా - 2 టీ స్పూన్లు
గుడ్డు - 1

తయారి:
చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి. దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చికెన్‌ను పొడవు పీసులుగా చేత్తో చేసి, గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి. వీటిని గుండ్రంగా తరిగిన ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మముక్కలతో అలంకరించాలి. టొమాటో లేదా సోయా సాస్‌తో వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.


చికెన్ చాప్స్

కావలసినవి:
బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.
పసుపు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - రెండు టీ స్పూన్లు

తయారి:
చికెన్‌ను ముక్కలు చేయకుండా పలచని పొర వచ్చేలా కట్ చేసుకోవాలి. తర్వాత కత్తితో మధ్య మధ్య గాట్లు పెట్టి దానికి అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు పట్టించి, 20 నిమిషాలు పక్కన ఉంచాలి. పెనం మీద స్పూన్‌తో నూనె వేసి ఒక్కో పొరను రెండు వైపులా కాల్చాలి. (ఉప్పు, కారం కావాలనుకుంటే రుచికి తగ్గట్టు కలుపుకోవచ్చు)
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html