Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

Soups (Winter Special)

ఒక్క సూపు చూద్దామా వింటర్‌ను - Soups (Winter Special)



ఎముకలు కొరికే చల్లగాలిలో బద్దకం తిష్ట వేస్తుంది. వంటగదిలోకి వెళ్ళడానికి మనసు మారాం చేస్తుంది. గొంతులోకి కాస్త వేడివేడిగా టీనో, కాఫీనో... కానీ ఎప్పుడూ అవేనా? సూప్‌లు ఉన్నాయి కదా... ఒక పట్టు పట్టవచ్చు కదా. ఉప్పు, కారం, ఒకటి రెండు కూరగాయలు కలిపి మరిగించి స్పూన్‌తో నోటికి అందుకుంటే ఆకలి అందుకుంటుంది. బద్దకం పారిపోతుంది. మూడ్ హుషారవుతుంది. ఇంట్లో ఉత్సాహం అడుగు మోపుతుంది. ఈ వింటర్‌ను ఒక సూపు చూడండి.



వెజిటబుల్ పాస్తా సూప్

కావలసినవి:
ఉడికించిన పాస్తా - కప్పు
క్యారట్ ముక్కలు - పావు కప్పు
బీన్స్‌ముక్కలు - 3 టీ స్పూన్లు
ఉల్లితరుగు - 2 టీ స్పూన్లు
క్యాప్సికమ్ తరుగు - 2 టీ స్పూన్లు
ఉల్లికాడల తరుగు - టీ స్పూన్
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - పావు టీ స్పూను
వెన్న - టీ స్పూను

తయారి:
బాణలిలో వెన్న వేడయ్యాక అందులో కూరగాయ ముక్కలను వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాక, నాలుగు కప్పుల నీరు, పాస్టా, ఉప్పు, మిరియాలపొడి వేసి మరిగించి దింపేయాలి. ఉల్లికాడల తరుగుతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

చికెన్ సూప్

కావలసినవి :
బోన్‌లెస్ చికెన్ - పావు కిలో
పాలకూర తరుగు - 1 కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
బీన్స్ తరుగు - పావు కప్పు
వెల్లుల్లి తరుగు - 1 టీ స్పూను
పచ్చిమిర్చి తరుగు -
1 టీ స్పూను
కార్న్ ఫ్లోర్ - 1 టీ స్పూను
నూనె - 1 టీ స్పూను
ఉప్పు - తగినంత
పంచదార -1 టీ స్పూను
మిరియాలపొడి - చిటికెడు
అజినమోటో - చిటికెడు
ఉల్లికాడల తరుగు -
2 టీ స్పూన్లు

తయారి:
చికెన్ మునిగేంతవరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్‌లో నూనె వేడిచేసి క్యారెట్, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగును వేసి రెండు నిమిషాలాగి చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, మిరియాల పొడి వేసి పదినిమిషాలు ఉడికించి స్టౌపైనుంచి దించేయాలి. చివరిగా అజినమోటో వేసి అతిథులకు వడ్డించండి.

పొటాటో, ఆనియన్ సూప్

కావలసినవి:
బంగాళదుంప - 1
ఉల్లిపాయ - 1
క్యారట్ తురుము - టీ స్పూను
వెన్న - టీ స్పూను
పుదీనా - కొద్దిగా
ఉప్పు - తగినంత
అజినమోటో - చిటికెడు
మిరియాలపొడి - చిటికెడు

తయారి:
బంగాళదుంపను సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయను చిన్నగా కట్ చేసుకోవాలి. పాన్‌లో వెన్న వేడి చేసి ఉల్లితరుగు, బంగాళదుంప తురుము వేసి కొద్దిగా వేయించాక, క్యారట్ తురుము, రెండు కప్పుల నీరు పోసి మరుగుతుండగా, మిరియాలపొడి, అజినమోటో వేసి మరోమారు బాగా కలిపి దించేయాలి. చివరగా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

క్యారట్ - ఓట్స్ సూప్

కావలసినవి:
ఓట్స్ - పావుకప్పు
క్యారట్ ముక్కలు - కప్పు
ఉల్లితరుగు - పావు కప్పు
వెన్న - టీ స్పూను
ఉప్పు - తగినంత
మిరియాలపొడి - చిటికెడు
కొత్తిమీర - కొద్దిగా

తయారి:
ఒక గిన్నెలో రెండుకప్పుల నీరు, ఉల్లితరుగు, క్యారట్ ముక్కలు వేసి మెత్తగా ఉడికించాలి. చల్లారాక గ్రైండ్ చేసుకుని వడకట్టుకోవాలి. పాన్‌లో వెన్న వేడి చేసి ఓట్స్ వేసి దోరగా వేగాక, కప్పుడు నీళ్లు, కొద్దిగా ఉప్పు వేసి రెండు నిముషాలు ఉడికించాలి. తరవాత ముందుగా ఉడికించుకున్న క్యారట్ రసం, మిరియాలపొడి వేసి చిక్కబడేవరకు మరిగించి దింపేయాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. ఇష్టపడేవారు ఇందులో టొమాటో లేదా చిల్లీసాస్ వేసుకోవచ్చు.

దాల్ షోర్బా

కావలసినవి:
కందిపప్పు లేదా పెసరపప్పు - 50 గ్రా.
ఉల్లిపాయ చిన్నది - 1 (సన్నగా తరగాలి)
అల్లం తురుము - టీ స్పూను
పచ్చిమిర్చితరుగు - టీ స్పూను
వెల్లుల్లి తరుగు - టీ స్పూను
వెన్న లేదా నెయ్యి - టీ స్పూను
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
కొత్తిమీర - కొద్దిగా

తయారి:
పప్పును కడిగి పది నిముషాలు నీళ్లలో నానపెట్టాలి. తరువాత అందులో పసుపు, సన్నగా తరిగిన అల్లం వేసి స్టౌ మీద ఉంచి, మెత్తగా ఉడికించి దింపేయాలి. బాగా చల్లారిన తరవాత గరిటెతో మెదిపి తగినన్ని నీళ్లు పోసి పలుచగా చేయాలి. పాన్‌లో వెన్న లేదా నెయ్యి వేడి చేసి అందులో ఉల్లి, వెల్లుల్లి, పచ్చిమిర్చి తరుగులను వేసి కొద్దిగా వేయించాలి. ఇందులో ముందుగా మెదిపి ఉంచుకున్న పప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పు కలిపి మరో ఐదు నిముషాలు మరిగించి దింపి, వడకట్టాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేయాలి.

వెజిటబుల్స్ - నూడుల్స్ సూప్

కావలసినవి:
బీన్స్‌ముక్కలు - పావు కప్పు, క్యారట్ ముక్కలు - పావు కప్పు, నూడుల్స్ - అర కప్పు, ఉల్లికాడల తరుగు- 4 టీ స్పూన్లు, అజినమోటో - చిటికెడు, ఉప్పు - తగినంత
నూనె - టీస్పూను, మిరియాలపొడి - పావు టీస్పూను
చిల్లీసాస్ - టీ స్పూను, సోయాసాస్ - పావు టీ స్పూను
కొత్తిమీర - కొద్దిగా

తయారి:
బీన్స్, క్యారట్‌ముక్కలను ఆరు కప్పుల నీటిలో ఐదు నిముషాలు ఉడికించి, వడకట్టి నీరు తీసి పక్కన పెట్టుకోవాలి. తగినంత నీరు పోసి నూడుల్స్‌ను కూడా ఉడికించి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. పాన్‌లో నూనె వేడి చేసి, ఉల్లికాడల తరుగు, ఉడికించిన కూరముక్కలు వేసి వేయించాక, కూరగాయలు ఉడికించిన నీళ్లు, అజినమోటో, మిరియాలపొడి, తగినంత ఉప్పు, సోయాసాస్, చిల్లీసాస్ వేసి మరిగించాలి. మరిగాక నూడుల్స్ కూడా వేసి కొద్దిసేపు ఉడికించాలి. కొద్దిగా చిక్కబడ్డాక ఉల్లికాడల తరుగు లేదా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html