Christmas Special - Mango Cake (క్రిస్మస్ స్పెషల్ కేక్: మ్యాంగో కేక్)
కావలసినవి:
మైదాపిండి: 1/2kg
పంచదార పొడి: 250grm
కోడిగుడ్లు: 8
కేక్‌జెల్: (బేకరీ ఐటెమ్స్ అమ్మే షాపులలో దొరుకుతుంది) 25grms
రిఫైన్డ్ ఆయిల్: 25ml
నీళ్లు: 20ml
మ్యాంగో ఎసెన్స్: మూడు చుక్కలు
బేస్ తయారు చేయుట:
ఒక పెద్ద పాత్రలో ముందుగా కోడిగుడ్ల సొన, పంచదార పొడి, నీరు వేసి బాగా బీట్ (కవ్వంలాంటి దానితో గిలకొట్టవచ్చు) చేయాలి. పంచదార పూర్తిగా కరిగాక మైదా, కేక్‌జెల్, రిఫైన్‌డ్ ఆయిల్ అన్నీ వేసి ఉండలుగా లేకుండా బాగా కలపాలి. (ఎంత ఎక్కువ సేపు కలిపితే కేక్ అంత మృదువుగా వస్తుంది). కేక్ మౌల్డ్ తీసుకుని దానికి బటర్ పూసి అందులో ఈ మిశ్రమాన్ని వేసి అవెన్ లో ఉంచాలి. దీనిని 180 డిగ్రీల నుంచి 200 డిగ్రీల టెంపరేచర్ లో సుమారు 40 నిముషాలు బేక్ చేసి తీసేయాలి.
డెకొరేషన్ క్రీమ్ కి కావలసినవి:
ఫ్రెష్ క్రీమ్: 1/2kg
పంచదార పొడి: 50grms
ఒక బౌల్‌లో ఫ్రెష్ క్రీమ్, పంచదారపొడి వేసి బాగా కలపాలి. పంచదారపొడి కరిగే వరకు అలా కలుపుతుంటే మంచి క్రీమ్ తయారవుతుంది. ఈ క్రీమ్‌తో కేక్ మీద..ఎవరి క్రియేటివిటీకి తగ్గట్లు వారు డెకరేట్ చేసుకోవచ్చు.
Topics: maida, egg, sugar, fresh cream, మైదా, గ్రుడ్డు, కేక్ జెల్, పంచదార, ఫ్రెష్ క్రీమ్
English summary
Christmas Special Mango Cake Recipe. This is an easy and quick Chritsmas Special Mango cake.

