Healthy Food for Babies - చిన్నారుల కోసం పౌష్టికాహారం

- ఎంతో రుచి.. అదనపు శక్తి
- చిన్నారుల కోసం తయారు చేసుకుందాం ఇలా..
అయితే పిల్లలు పుట్టినప్పటి నుంచి తల్లిపాలు ఎంతో ముఖ్యమని, ఆరు నెలలు దాటిన తరువాత నెమ్మది నెమ్మదిగా ఆహారాన్ని అందించాలని అంటున్నారు. తల్లిపాలు రెండేళ్ల వరకు ఇవ్వాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అదేవారికి మొదటి పౌష్టికాహారమని, తరువాత ఇంట్లో తయారు చేసి అందించే పదార్ధాలు వారికి అదనపు శక్తిని సమకూరుస్తాయని చెబుతున్నారు. అతి తక్కువ సమయంలో ఈ పౌష్టికాహారాన్ని తయారు చేసుకునే విధానాలను వివరించారు.
గోధుమ రవ్వతో కిచిడి
డాల్డా వేడిచేసి జీలకర్ర, పచ్చిమిర్చి ఆవాలు తాళింపు పెట్టుకోవాలి. అందులో నీరుపోసి, పెసరపప్పు వేసి ఉడికించాలి. చివరగా కడిగి సన్నగా తరిగిన ఆకు కూరను కలుపుకోవచ్చు. కొన్ని నిమిషాలు ఉడికించి నీరు మొత్తం పోయాక పిల్లలకు వడ్డించుకోవచ్చు.
గోధుమ పాయసం
గోదుమ రవ్వ, పెసరపప్పును కలుపుకోవాలి. నీటిలో కడిగి 5 నుంచి 10 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి రవ్వ పప్పు మిశ్రమాన్ని మెత్తగా ఉడికించాలి. ఇందులో బెల్లం, డాల్డా వేసి బెల్లం కరిగేంత వకు ఉంచి చివరలో యాలకల పొడి వేసి గోధుమ పాయసం తయారు చేసుకోవచ్చు.
గోధుమ శనగపిండి లడ్డు
గోధుమ, శనగపిండిని కలిపి దోరగా వేయించుకోవాలి. ఇందులో ముందుగా సరిపడా నీటితో తయారు చేసిన బెల్లం పాకాన్ని వేసుకోవాలి. కలిపే సమయంలో కాసింత నెయ్యి వేస్తే సువాసనతో పాటు, రుచి పిల్లలను ఆకట్టుకుంటుంది.
రాగి లడ్డు
రాగిపిండిని 20 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. వేరుసెనగలను వేయించి పైపొట్టు తీసి పొడి చేసుకోవాలి. బెల్లంను తీగ పాకంలా తయారు చేసుకోవాలి. బెల్లం పాకంలో ఉడికించిన రాగిపిండి, వేరుసెనగ గింజల పొడి, నెయ్యి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఇష్టమైన ఆకృతిలో అందించవచ్చు.
తీపి పొంగల్
పెసరపప్పును దోరగా వేయించి బియ్యంతో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని 5 నుంచి 10 నిమిషాల వరకు నీటిలో నానబెట్టాలి. ఆ తరువాత నీటిని మరిగించి ఆ మిశ్రమా న్ని అందులో వేసి మెత్తపడే వరకు ఉడికిం చాలి. రుచికోసం కొద్దిగా ఉప్పు, పొడిగా చేసిన బెల్లం, నెయ్యి సైతం కలుపుకోవచ్చు. బెల్లం కరిగి ఉడికించి తీపి పొంగలిని పిల్లలకు వేడివేడిగా పెట్టుకోవచ్చు.

