Ads 468x60px

Pages

Learn English Vocabulary & Help the Poor| |Free Rice |

BengAli Sweet Box - బెంగాలీ స్వీట్ బాక్స్

BengAli Sweet Box - బెంగాలీ స్వీట్ బాక్స్

బెంగాలీ స్వీట్ బాక్స్
 దసరా పండుగ... దేశమంత పండుగ!
 రుచులు, ఆచారాలు... సంస్కృతులు, సంప్రదాయాలు...
 ఆటలు, పాటలు... వేషాలు, విశేషాలు...
 ఎంత భిన్నంగానైనా ఉండనివ్వండి, నవరాత్రి వేడుకల్లోని అర్థం, పరమార్థం మాత్రం ఒకటే.
 విజయం అందించిన తియ్యదనాన్ని ఆత్మీయంగా పంచుకోవడం!
 శక్తిమాతకు వేర్వేరు రూపాలున్నట్లే...
 మిఠాయిలకూ వేర్వేరు రాష్ట్రాలు.
 ఆ స్వీట్ బాక్సుల్లోంచి ఈసారి మనం మధురాతిమధురమైన...
 బెంగాలీ బాక్స్‌ను ఓపెన్ చేద్దాం.

రాజ్‌భోగ్ -rAj bhOj


 కావలసినవి:
 పాలవిరుగు - 250 గ్రా. (ఆవు పాల నుంచి చేసినది); పచ్చికోవా - 3 టేబుల్ స్పూన్లు; పిస్తాపప్పులు - 15; మైదా - టీ స్పూను; పంచదార - 5 కప్పులు; కుంకుమపువ్వు - అర టీ స్పూను; రోజ్ సిరప్ - 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - అర టీ స్పూను.

 తయారి:  
 పాలవిరుగును మెత్తగా మెదిపి, దానికి మైదా జత చేయాలి. దానిని బాగా కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి  
 వేడినీటిలో పిస్తా పప్పులను వేసి ఐదు నిముషాలు ఉంచి, నీటిని వడగట్టి, పైన తొక్కలు తీసి, సన్నగా కట్ చేసుకోవాలి  
 పచ్చికోవా పొడి, పిస్తా తరుగు, బాదం పప్పులను ఒక గిన్నెలో వేసి కలిపి, చిన్నచిన్న ఉండలుగా చేయాలి. పాలవిరుగుతో చేసిన ఒక్కో ఉండలో ఈ మిశ్రమాన్ని స్టఫ్ చేసి పక్కన ఉంచాలి
 ఒక పాత్రలో పంచదార, నీరు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, వెడల్పాటి పాత్రలో పోసి, కుంకుమపువ్వు రేకలు వేయాలి  
 తయారుచేసి ఉంచుకున్న స్టఫ్‌డ్ బాల్స్‌ని ఇందులో వేసి స్టౌ మీద ఉంచి, ఐదు నిముషాలు ఉడికించాలి  
 అరకప్పు వేడినీరు పోసి, మరో ఐదునిముషాలు ఉంచితే, బాల్స్ రెట్టింపు సైజుకి పొంగుతాయి.

రబ్దీ ఆతార్ పాయస్ - rabdi AtAr pAyas


 కావలసినవి:
 చిక్కటిపాలు - రెండున్నర కప్పులు; పంచదార - పావు కప్పు; సీతాఫలం గుజ్జు - 100 గ్రా. (గింజలు వేరు చేసి గుజ్జు తీసుకోవాలి)

 తయారి:  
 ఒక పాత్రలో పాలు మరిగించి, మంట తగ్గించి 20 నిముషాలు అలాగే ఉంచి, పాలు సుమారు సగం అయ్యేవరకు కలుపుతుండాలి  
 పంచదార జత చేసి మరో 25 నిముషాలు ఉంచి దించి, చల్లారనియ్యాలి
  సీతాఫలం గుజ్జును జతచేసి, పిస్తాలతో గార్నిష్ చేయాలి.

రసమలై - rasamalai


 కావలసినవి:
 ఆవుపాలు - రెండున్నర కప్పులు (సుమారు అరలీటరు); గేదెపాలు - రెండున్నర కప్పులు (సుమారు అర లీటరు); నిమ్మరసం - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; పంచదార - కప్పు

 తయారి:  
 మందంగా ఉన్న పెద్ద పాత్రలో ఆవుపాలు, గేదెపాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించి, దింపేయాలి  
 రెండు నిముషాల తరువాత నిమ్మరసం వేస్తూ పాలను నెమ్మదిగా కలపాలి
 పాలు విరిగి, అందులోని నీరు విడిపోయేంత వరకు ఉంచాలి  
 పల్చటి వస్త్రంలో నీటిని వడపోసి, ముద్దలాంటి పదార్థంతో ఉన్న వస్త్రాన్ని చల్లటి నీటిలో రెండు మూడు సార్లు ముంచి తీయాలి వస్త్రాన్ని గట్టిగా మూటగట్టి, నీరంతా పోయేవరకు వేలాడదీయాలి  
 పాలవిరుగులో ఇంకా నీరు ఉందనిపిస్తే పూర్తిగా పిండేసి, మెత్తగా అయ్యేవరకు (ఉండలు లేకుండా) చేతితో బాగా కలపాలి  
 కొద్దికొద్దిగా విరుగు ముద్దను చేతిలోకి తీసుకుని, ఉండల్లా తయారుచేసి పక్కన ఉంచాలి. (పైన ఎటువంటి పగుళ్లు లేకుండా చూసుకోవాలి)  
 ఐదు కప్పుల నీటిని మరిగించి, పంచదార వేసి కరిగేవరకు కలపాలి
 పంచదార పాకంలో వీటిని వేసి సుమారు ఏడెనిమిది నిముషాలు ఉడికించి, కిందకు దింపి, పావుగంటసేపు అలాగే ఉంచేయాలి  
 వీటిని ఒక పాత్రలో పోసి, ఫ్రిజ్‌లో ఉంచి, చల్లగా సర్వ్ చేయాలి.

మిస్టీ ధోయ్ - misty dhOy


 కావలసినవి:
 పాలు - లీటరు; పెరుగు - అర టీ స్పూను; పంచదార - కప్పు; నీరు - 2 టేబుల్ స్పూన్లు

 తయారి:  
 పాలను మరిగించి, సగం ఇగిరేవరకు ఉంచాలి 
 ఒక పాత్రలో పంచదార, నీరు వేసి స్టౌ మీద ఉంచి లేత గోధుమరంగు వచ్చేవరకు ఉంచాలి  
 ఈ మిశ్రమాన్ని పాలలో వేసి గబగబ కలిపి దించేయాలి  
 పాలు బాగా చల్లారిన తర్వాత పెరుగు వేసి బాగా కలపాలి  
 చల్లటి ప్రదేశంలో రాత్రి అంతా అలానే ఉంచేయాలి  
 ఉదయాన్నే చల్లగా సర్వ్ చేయాలి.

పాంటువా - pANTuvA


 కావలసినవి:
 పచ్చికోవా - రెండు కప్పులు; మైదా - 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి - పావు టీ స్పూను; నెయ్యి లేదా వనస్పతి - వేయించడానికి తగినంత.

 పాకం కోసం:
 పంచదార - 3 కప్పులు; కుంకుమపువ్వు-కొద్దిగా (తప్పనిసరి కాదు)

 తయారి:  
 ఒక పెద్దపాత్రలో ఒకటిన్నర కప్పుల నీరు, పంచదార వేసి మరిగించాలి
 మంట తగ్గించి తీగపాకం వచ్చేవరకు కలపాలి  
 చన్నీటిలో కలిపిన కుంకుమపువ్వు జత చేసి రెండు నిముషాలు ఉంచి దించేయాలి  ఒకపాత్రలో పచ్చికోవా, మైదా, ఏలకుల పొడి వేసి బాగా కలిపి, (అవసరమనుకుంటే కొద్దిగా నీరు జత చేయాలి) చిన్నచిన్న ఉండలు చేయాలి. (పగుళ్లు లేకుండా జాగ్రత్తపడాలి. పదినిముషాల సేపు ఫ్రిజ్‌లో ఉంచి తీశాక వేయించితే విరిగిపోకుండా వస్తాయి)
 నేతిలో వీటిని వేయించి, బంగారువర్ణంలోకి వచ్చాక తీసి చల్లటి పంచదార పాకంలో వేసి పావుగంట తర్వాత సర్వ్ చేయాలి.

రసగుల్ల - rasagulla


 కావలసినవి:
 పాలవిరుగు - కప్పు; మైదా - టేబుల్ స్పూను; కార్న్‌ఫ్లోర్ - అర టీ స్పూను; పంచదార - ఒకటిన్నర కిలోలు; పాలు - రెండు టేబుల్ స్పూన్లు; రబ్దీ కోసం; పాలు - పది కప్పులు; పంచదార - 6 టేబుల్ స్పూన్లు; కుంకుమపువ్వు - కొద్దిగా (చల్లటి పాలలో వేసి కరిగించాలి); ఏలకులపొడి - పావు టీ స్పూను; గార్నిషింగ్ కోసం; పిస్తా పప్పులు - రెండు టేబుల్ స్పూన్లు

 తయారి:  
 పాల విరుగును చేతితో బాగా కలిపి మెత్తగా చేయాలి  
 ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలుగా చేసి ఆ తర్వాత ఫ్లాట్‌గా ఒత్తాలి. (ఎక్కడా పగుళ్లు లేకుండా చూసుకోవాలి)  
 రెండువైపులా మైదా అద్ది ఒక ప్లేట్‌లో పక్కన ఉంచాలి
 మిగిలిన మైదాపిండి, కార్న్‌ఫ్లోర్‌లను అరకప్పు నీటిలో కలపాలి
 పెద్ద పాత్రలో ఐదు కప్పుల పంచదార వేసి కరిగేవరకు ఉడికించాలి  
 అరకప్పు పాలు జత చేసి పాకం ఉడికే వరకు ఉంచాలి  
 పాలు పైకి పొంగినప్పుడు గరిటెతో కలుపుతుండాలి
 పాకం బాగా ఉడికిన తర్వాత ఒక పాత్రలోకి వడబోయాలి  
 ఒక కప్పు పాకాన్ని పక్కన ఉంచి, మిగిలిన పాకాన్ని వెడల్పుగా, లోతుగా ఉండే పాత్రలో పోసి, ఐదుకప్పులు నీరు జతచేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి
 బాగా ఉడుకుతుండగా తయారుచేసి ఉంచుకున్న పాలవిరుగు టిక్కీలను ఇందులో వేయాలి
 పిండి జతచేసిన నీటిని కొంత ఇందులో పోయాలి  
 టిక్కీలు పాత్రకు అతుక్కోకుండా జాగ్రత్తగా కలుపుతుండాలి  
 పాత్ర అంచులకు మాత్రమే తగిలేలా అరకప్పు నీటిని ఐదు నిముషాలకొకసారి పోయాలి. (ఇలా చేయడం వల్ల పాకం చిక్కబడదు)  
 పావుగంట సేపు ఇలాగే ఉడికించాలి
 స్పూన్‌తో జాగ్రత్తగా తీసి అంతకుముందు తయారుచేసి ఉంచుకున్న పాకంలో వేయాలి  
 రబ్దీ తయారుచేసేటప్పుడు పాలను మందంగా, లోతుగా ఉండే నాన్‌స్టిక్ పాన్‌లో ఉంచి, మంటను పెంచుతూ తగ్గిస్తూ, ఆపకుండా కలుపుతూ, మూడువంతులు వచ్చేంత వరకు కలుపుతుండాలి. అంచులకు అంటిన క్రీమ్‌ని ఎప్పటికప్పుడు కలుపుతుండాలి.

బెంగాలీ సందేశ్ - BengAli sandEsh


 కావలసినవి:
 పాలవిరుగు - పావు కప్పు; పంచదారపొడి - పావు కప్పు కంటే తక్కువ

 తయారి:  
 పాలవిరుగును చల్లారబెట్టి అందులో పంచదార పొడి వేసి నెమ్మదిగా కలపాలి  
 ఈ మిశ్రమాన్ని నాన్‌స్టిక్ పాన్‌లో వేసి, సన్నని మంట మీద మూడు నిముషాలు ఉంచాలి (ఉడుకుతున్నంతసేపు కలుపుతూనే ఉండాలి)  
 బాగా ఉడికిన తర్వాత కిందకు దించి చల్లారనివ్వాలి
 ఉండలు లేకుండా చేతితో బాగా కలిపి మెత్తగా చేయాలి
 ఏ ఆకారంలో కావాలంటే ఆ ఆకారంలో చేసుకుని, నచ్చిన డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి.

ఇవి పాటించండి - Follow These...


 రసగుల్ల, గులాబ్‌జామ్, రసమలై వంటి వాటిని ఉడికించడానికి తగినంత వెడల్పు ఉన్న పాత్రను ఎంచుకోవాలి. పాత్ర ఇరుకుగా ఉంటే ఒకదానితో ఒకటి అతుక్కుని ముద్దలా అయిపోతాయి.    
 పాలవిరుగును చేతితో ఎంత ఎక్కువసేపు మెదిపితే అంత మెత్తబడి... రసగుల్ల, గులాబ్‌జామ్ వంటివి బాగా వస్తాయి.    
 రసగుల్ల, గులాబ్‌జామూన్, రసమలై... వీటిని చేతిలో రౌండ్‌గా చేసేటప్పుడు పైన పగుళ్లు లేకుండా చూసుకోవాలి. ఏమాత్రం పగులు ఉన్నా సరిగా రావు.    
 పంచదార పాకం పట్టినప్పుడు మలినాలు పైకి తేలతాయి. వాటిని వడగట్టి, అరకప్పు చన్నీరు కలిపి మళ్లీ పాకం పట్టుకుంటే స్వీట్లు రుచిగా ఉంటాయి.

ఇంటిదగ్గరే కోవా తయారుచేసుకోవడం - Make/Prepare Kova at Home...


 వెడల్పాటి నాన్‌స్టిక్ పాన్‌లో పాలు పోసి మరిగించాలి.    
 పాలు చిక్కబడగానే మంట తగ్గించి, పాలు బాగా దగ్గర పడేవరకు ఉంచి దించి బాగా చల్లారనిస్తే పచ్చి కోవా తయారయినట్లే.
Learn English Vocabulary & Help the Poor |Free Rice |
 
google-site-verification: google2463dc209284d38a.html